మెరీనా బీచ్ లో కుదరదు... కరుణ అంత్యక్రియలపై సిద్ధమైన ప్రభుత్వ అఫిడవిట్!
- చాలా కారణాలు అడ్డు వస్తున్నాయి
- ప్రత్యామ్నాయంగా రెండు ఎకరాలు ఇస్తాం
- కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయనున్న సర్కారు
మెరీనా బీచ్ లో స్థలాన్ని కేటాయించలేక పోతున్నామని, దీనికి ప్రత్యామ్నాయంగా గిండిలో రెండు ఎకరాల స్థలం కేటాయించామని పేర్కొంది. కొన్ని సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితులతో పోలిస్తే, ఇప్పటి పరిస్థితులు వేరని, పర్యావరణ సమస్యలు ఎన్నో ఉన్నాయని చెప్పింది. మెరీనా బీచ్ లో నిర్మాణాలపై హైకోర్టులో పలు కేసులు విచారణ దశలో ఉన్నాయని గుర్తు చేయనుంది.