సంగీత దర్శకుడు చక్రవర్తి మనవడు హీరోగా 'శివకాశీపురం' .. రేపే రిలీజ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సంగీత దర్శకుడు చక్రవర్తి మనవడు హీరోగా 'శివకాశీపురం' .. రేపే రిలీజ్

  • ఇదొక సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ 
  • యథార్థ సంఘటన ఆధారంగా అల్లిన కథ 
  • ఆటో డ్రైవర్ పాత్రలో హీరో రాజేశ్   
తెలుగువారి హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత దర్శకులలో చక్రవర్తి ఒకరు. ఆయన తనయుడు 'శ్రీ' కూడా కొన్ని సినిమాలకి సంగీతాన్ని అందించి తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. 'శ్రీ' తనయుడు రాజేష్ మాత్రం సంగీతంపై కాకుండా నటనపై దృష్టిపెట్టాడు. ఆయన మొదటి చిత్రంగా 'శివకాశీపురం' .. హరీశ్ వట్టికూటి దర్శకత్వంలో రూపొందింది.

 ప్రియాంక శర్మ కథానాయికగా నటించిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రాజేశ్ మాట్లాడుతూ .. "సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ కథ కొనసాగుతుంది. ఈ సినిమాలో నేను ఆటో డ్రైవర్ గా కనిపిస్తాను. 'శివకాశీ పురం'లోని కోట చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అందువల్లనే ఈ సినిమాకి ఈ టైటిల్ పెట్టాము. ఒక యథార్థ సంఘటనను ఆధారంగా చేసుకుని అల్లిన కథ ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం వుంది" అంటూ చెప్పుకొచ్చాడు.  
rajesh
priyanka

More Telugu News