అయామ్ ఫైన్.. హిమాలయాల్లో ఉన్నా.. కేన్సర్ పుకార్లపై లక్కీ అలీ స్పందన
Add ap7am to your home Screen

అయామ్ ఫైన్.. హిమాలయాల్లో ఉన్నా.. కేన్సర్ పుకార్లపై లక్కీ అలీ స్పందన

  • సింగర్ లక్కీ అలీకి కేన్సర్ అంటూ పుకార్లు
  • కొట్టి పడేసిన అలీ
  • నిక్షేపంగా ఉన్నానంటూ ట్వీట్
తాను కేన్సర్‌తో బాధపడుతున్నట్టు వస్తున్న వార్తలపై ప్రముఖ గాయకుడు లక్కీ అలీ స్పందించారు. తాను బాగానే ఉన్నానని, తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని కొట్టి పడేశారు. తాను కేన్సర్‌తో బాధపడుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ‘‘నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. ప్రస్తుతం హిమాలయాల్లో కూర్చున్నా’’ అని పేర్కొన్నారు.

‘‘డియర్ కీమోథెరపీ, నువ్వు ఎప్పటికీ పరిష్కారం కాలేవు’’ అంటూ ఇటీవల ఆయన చేసిన ట్వీట్ తో ఆయనకు కేన్సర్ సోకిందంటూ ప్రచారం జరిగింది. అదే సమయంలో బాలీవుడ్ నటి సోనాలి బింద్రే తాను కేన్సర్‌తో బాధపడుతున్నట్టు వెల్లడించింది. దీంతో అలీ అభిమానులు ఆందోళన చెందారు. ఆయనకు కూడా కేన్సర్ సోకిందని భావించారు. ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. దీనిపై ఆయన తాజాగా స్పష్టతనిస్తూ, తన స్నేహితుడు ఇదే వ్యాధితో మరణించాడని, కాబట్టి కీమోథెరపీ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ, ఆ ట్వీట్ చేశానని, తాను నిక్షేపంగా వున్నానని చెప్పారు.  

90లలో తన గాత్రంతో దేశాన్ని ఓ ఊపు ఊపిన 59 ఏళ్ల లక్కీ అలీ, తన గానంతో ఎన్నో హృదయాలను కొల్లగొట్టారు.
Lucky Ali
Cancer
Rumors
Himalayas

More Telugu News