నేను హీరోయిన్ గా పనికి రానని నాకు తెలుసు: రమాప్రభ
Add ap7am to your home Screen

నేను హీరోయిన్ గా పనికి రానని నాకు తెలుసు: రమాప్రభ

  • నేను చదువుకోలేదు 
  • నాటకాలు వేస్తూ సినిమాల్లోకి వచ్చాను
  • హీరోయిన్స్ కి ఆ అవకాశం ఉండదు  
తెలుగు తెరపై హాస్యనటిగా తనదైన ముద్రవేసిన రమాప్రభ, ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాంటి రమాప్రభ తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకున్నారు. "రమాప్రభ కమెడియన్ గానే ఎందుకు మిగిలిపోయింది? ఎందుకు హీరోయిన్ కాలేకపోయింది?" అనే ప్రశ్న ఆమెకి ఈ కార్యక్రమంలో ఎదురైంది.

అప్పుడామె స్పందిస్తూ .. "చిలక గోరింక ' సినిమాలో హీరోయిన్ తో సమానమైన పాత్ర వచ్చింది. అందువలన హీరోయిన్ పాత్ర గురించి ఆలోచించలేదు. మరో విషయమేమిటంటే, నాకు తెలుసు.. నేను హీరోయిన్ గా పనికి రానని. హీరోయిన్ కి లాంగ్ లైఫ్ లేదు .. విభిన్నమైన పాత్రలను చేసే ఛాన్స్ ఉండదు. అందువలన నేను హీరోయిన్ పాత్రలపై ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. అసలు నాకు చదువురాదు .. ఆర్.ఎస్.మనోహర్ ట్రూప్ లో నాటకాలు వేస్తూ ..  సినిమాల్లోకి వచ్చాను" అంటూ చెప్పుకొచ్చారు.   
ramaprabha
ali

More Telugu News