'ఆర్ ఎక్స్ 100' దర్శకుడికి వరుస అవకాశాలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఆర్ ఎక్స్ 100' దర్శకుడికి వరుస అవకాశాలు

  • అజయ్ భూపతి దర్శకత్వంలో 'ఆర్ ఎక్స్ 100'
  • అన్ని ఏరియాల్లో సూపర్ హిట్ టాక్ 
  • దర్శకుడికి ఫుల్ మార్కులు
ఈ మధ్య కాలంలో వచ్చిన యూత్ కి నచ్చిన సినిమాల జాబితాలో 'ఆర్ ఎక్స్ 100' చేరిపోయింది. లవ్ .. యాక్షన్ కలిపి అల్లిన ఈ కథ యూత్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. చాలా తక్కువ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా .. భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. దాంతో ఈ సినిమా దర్శకుడు అజయ్ భూపతికి వరుస అవకాశాలు వస్తున్నాయట. పెద్ద పెద్ద నిర్మాతలు తమ బ్యానర్లో సినిమాలు చేయమని ఆయనని అడుగుతున్నారని తెలుస్తోంది.

భవ్య క్రియేషన్స్ ఆనంద్ ప్రసాద్ .. గోపీచంద్ సినిమా కోసం అజయ్ భూపతిని అడిగారట. ఇక రామ్ కోసం స్రవంతి మూవీస్ రవికిశోర్ .. నితిన్ కోసం ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి కూడా అజయ్ భూపతిని సంప్రదించారని అంటున్నారు. వరుసగా రెండు ప్రాజెక్టులు చేయవలసి ఉంటుందంటూ మరో అగ్ర నిర్మాత కూడా ఆయనతో మాట్లాడినట్టుగా చెప్పుకుంటున్నారు. అజయ్ భూపతి ముందుగా ఎవరి ప్రాజెక్టును పట్టాలెక్కిస్తాడో చూడాలి మరి.    
karthikeya
payal

More Telugu News