'ఆర్ ఎక్స్ 100' .. రెండో రోజు అదే జోరు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఆర్ ఎక్స్ 100' .. రెండో రోజు అదే జోరు

  • యూత్ మెచ్చిన చిత్రంగా 'ఆర్ ఎక్స్ 100'
  • కొత్తవాళ్లే అయినా భారీ ఓపెనింగ్స్ 
  • చిన్న సినిమా .. పెద్ద విజయం      
'ఆర్ ఎక్స్ 100' .. దర్శకుడు .. హీరో హీరోయిన్లు కొత్తవాళ్లు కావడంతో, విడుదలకి ముందు ఈ సినిమాను గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. చాలా చిన్న సినిమాగానే థియేటర్లకు వచ్చిన 'ఆర్ ఎక్స్ 100' భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. తొలి రోజున తొలి ఆటతోనే యూత్ అంతా కలిసి ఈ సినిమాకి హిట్ ముద్ర వేసేశారు. ఈ తరం కుర్రకారు కోరుకునే అంశాలతో అల్లిన కథ కావడంతో, వాళ్లకు ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది.

రొమాంటిక్ లవ్ స్టోరీకి యాక్షన్ ను కలిపి దర్శకుడు అజయ్ భూపతి అందించిన తీరు కుర్రకారుకు బాగా నచ్చేసింది. దాంతో థియేటర్ల దగ్గర జనం పెరిగిపోతున్నారు. రెండు రాష్ట్రాల్లో రెండు రోజులకు గాను ఈ సినిమా 2.51 కోట్ల షేర్ ను వసూలు చేసింది. శని .. ఆదివారాల్లో ఈ సినిమా వసూళ్లు మరింతగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని సాధించిన వాటి జాబితాలో ఈ సినిమా చేరిపోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.     
karthikeya

More Telugu News