పూరి జగన్నాథ్ గురించి అప్పటికి ఇంకా తెలియదు: హీరోయిన్ సంజన
Add ap7am to your home Screen

పూరి జగన్నాథ్ గురించి అప్పటికి ఇంకా తెలియదు: హీరోయిన్ సంజన

  • ఏ ప్రాజెక్టు వచ్చినా ఎంక్వైరీ చేస్తాను 
  • తెలుగులో 'సోగ్గాడు' ఫస్టుమూవీ
  • పూరి దర్శకత్వంలో 'బుజ్జిగాడు' చేశాను
తెలుగు తెరకి పరిచయమైన అందమైన కథానాయికలలో సంజనా గల్రాని ఒకరు. కన్నడ .. మలయాళ సినిమాలతో పాటు కొన్ని తెలుగు సినిమాలలోను ఆమె నటించింది. అలాంటి సంజనా తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ తన కెరియర్ గురించిన విషయాలను ప్రస్తావించింది.

"తెలుగులో తరుణ్ హీరోగా చేసిన 'సోగ్గాడు' సినిమాలో ఫస్టు టైమ్ కనిపించాను. నాకు ఏదైనా ఒక సినిమాలో అవకాశం వస్తే, ఆ సినిమా చేయవచ్చా .. దర్శక నిర్మాతల నేపథ్యం ఎలాంటిది? అని ఎంక్వైరీ చేస్తుంటాను. అలాగే పూరి దర్శకత్వంలో 'బుజ్జిగాడు' సినిమాలో ఛాన్స్ వచ్చినప్పుడు కూడా ఒకరిద్దరిని ఎంక్వైరీ చేసిన తరువాతనే ఆ సినిమా చేశాను. అప్పటికే పూరి గారు స్టార్ డైరెక్టర్ .. కానీ నాకు ఆ విషయం తెలియకపోవడం వలన, అలా చేయవలసి వచ్చింది. ఆయన వంటి స్టార్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ రావడమే అదృష్టం .. కళ్లు మూసుకుని చేసేయండి అన్నారు .. చేశాను" అని చెప్పు కొచ్చింది.      
sanjana
ali

More Telugu News