సినీ నటుడు శరత్ కుమార్ పై కేసు నమోదు
- నడిగర్ సంఘం ఆస్తులను అమ్మేశారంటూ కేసు
- పలు అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు
- గతంలో నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న శరత్ కుమార్
గతంలో నడిగర్ సంఘం అధ్యక్షుడిగా శరత్ కుమార్, కోశాధికారిగా రాధారవిలు ఉన్న సమయంలో పలు అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. కాంచీపురం జిల్లాలో నడిగర్ సంఘానికి ఉన్న 26 సెంట్ల స్థలాన్ని వీరు విక్రయించినట్టు... ప్రస్తుత సంఘ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే వీరిపై కేసు నమోదైంది.