ప్రేమలో పడ్డాను .. పెళ్లి చేసుకోవడమే కుదరలేదు: గెటప్ శీను
Add ap7am to your home Screen

ప్రేమలో పడ్డాను .. పెళ్లి చేసుకోవడమే కుదరలేదు: గెటప్ శీను

  • ఆమె కోసం అంత దూరం వెళ్లేవాడిని 
  • ఒక గంటసేపే మాట్లాడనిచ్చేవాళ్లు 
  • పెళ్లి చేసుకుందామనుకున్నాను  
బుల్లితెరపై తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న గెటప్ శీను .. ప్రస్తుతం వెండితెరపై నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. తాజాగా ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు. "నేను ఒక అమ్మాయిని ప్రేమించాను .. ఆమె తమిళనాడులోని 'తిరుప్పూర్' లో ఒక హాస్టల్లో ఉండేది. 15 రోజులకు ఒకసారి నేను అక్కడికి వెళ్లేవాడిని.

హాస్టల్ వాళ్లు ఒక గంటసేపు మాట్లాడటానికే అనుమతినిస్తారు. ఆ గంటసేపటి కోసం నేను మా ఆకివీడు నుంచి అంతదూరం వెళ్లేవాడిని. తాను అక్కడి నుంచి తన ఊరు వెళ్లాలనుకుంటే మాత్రం నేను కూడా హాస్టల్ దగ్గరికి వెళ్లి .. అక్కడి నుంచి కలిసి ప్రయాణం చేసేవాళ్లం. ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకున్నాను .. కానీ వాళ్ల వాళ్లు ఒప్పుకోలేదు. ఆ అమ్మాయికి వేరే అతనితో పెళ్లై ఇప్పుడు ఢిల్లీలో ఉంటోంది. అప్పుడు బాధపడినా .. నన్ను అర్థం చేసుకునే భార్య దొరికినందుకు ఇప్పుడు హ్యాపీగానే వున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.   
getup srinu
ali

More Telugu News