ఆర్ధిక ఇబ్బందుల కారణంగా కూలి పనులకు కూడా వెళ్లాను: గెటప్ శీను
- అక్కయ్య పెళ్లి వలన అప్పులు
- గవర్నమెంట్ స్కూల్లో చదువు
- డబ్బులు వుండేవి కావు
"మా అక్కయ్య పెళ్లి కోసం మేము అప్పు చేశాము. అందువలన ఆర్ధికంగా ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్లం. నేను అప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ హాస్టల్లో ఉండేవాడిని .. ఫీజులకి .. పుస్తకాలకి డబ్బులు ఉండేవి కావు. అందువలన వేసవి సెలవులు రాగానే ఇంటికి వెళ్లకుండా ఎక్కడ పని దొరుకుతుందా అని వెతుక్కునేవాడిని. చెరుకు మిషన్ దగ్గర పనిచేసేవాడిని .. అలా పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బులు వచ్చేవి. ఇక ప్రతి ఆదివారం కూలి పనులకు వెళ్లేవాడిని .. నాట్లు వేయడం .. కుప్పనూర్చడం వంటి పనులు చేసేవాడిని .. రోజుకు 40 .. 50 రూపాయలు వచ్చేవి" అంటూ చెప్పుకొచ్చాడు.