మరోసారి నితిన్ జోడీగా హన్సిక
- నితిన్ హీరోగా 'భీష్మ'
- దర్శకుడిగా వెంకీ కుడుముల
- త్వరలోనే సెట్స్ పైకి
ఆ తరువాత కూడా తమిళ సినిమాలనే చేస్తూ వెళుతోన్న ఆమె , తాజాగా ఒక తెలుగు సినిమా చేయడానికి అంగీకరించినట్టు సమాచారం. నితిన్ హీరోగా ఒక రొమాంటిక్ లవ్ స్టోరీని చేయడానికి దర్శకుడు వెంకీ కుడుముల సన్నాహాలు చేసుకుంటున్నాడు. రీసెంట్ గా ఈ సినిమాకి 'భీష్మ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో కథానాయికగా హన్సికను ఎంపిక చేశారట. గతంలో నితిన్ జోడీగా ఆమె 'సీతారాముల కల్యాణం లంకలో' అనే సినిమా చేసిందనే సంగతి తెలిసిందే.ఈ కాంబినేషన్లోని కొత్త ప్రాజెక్టు త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.