పూజ చేస్తూ శివలింగంపైనే కుప్పకూలి.. శివైక్యం చెందిన అర్చకుడు.. వీడియో చూడండి!
- భీమవరం సోమేశ్వర జనార్దనస్వామి ఆలయంలో ఘటన
- స్వామివారిపై పడి తుదిశ్వాస విడిచిన అర్చకుడు వెంకటరామారావు
- 40 ఏళ్లుగా ఇదే ఆలయంలో సేవ చేస్తున్న అర్చకుడు
గుడిలో ఉన్న ఇతర అర్చకులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందారని వైద్యులు తెలిపారు. గర్భగుడిలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ ఘటన 11వ తేదీనే జరిగినా, ఆలస్యంగా వెలుగు చూసింది. రికార్డు అయిన దృశ్యాలను పరిశీలించగా... శివలింగంపైనే ఆయన తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తోంది. గత 40 ఏళ్లుగా ఆయన ఈ ఆలయంలోనే స్వామివారికి సేవ చేస్తున్నారు.