హీరో అంటే ఎంతో క్రేజ్ ఉండాలి .. ఆయన మూవీ కోసం ఫ్యాన్స్ ఎదురుచూడాలి: కమెడియన్ శ్రీనివాస రెడ్డి
- హీరో అనే మాటకి నేను సూటబుల్ కాదు
- పోస్టర్ తోనే జనం దృష్టిని ఆకర్షించాలి
- రిలీజ్ రోజునే జనం క్యూలో నుంచోవాలి
ఏ హీరో సినిమా రిలీజ్ అవుతున్నా దానికో క్రేజ్ ఉంటుంది .. ఆ హీరోకి ఒక కేపబులిటీ వుంటుంది. ఆ హీరో నెక్స్ట్ మూవీ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తారు. కానీ శ్రీనివాస రెడ్డి సినిమా ఎప్పుడొస్తుందా అని ఎవరూ ఆలోచించరు. అందువలన కమెడియన్ గా కనిపిస్తూ .. బాగా చేశాడ్రా అనిపించుకుంటూ .. హీరోగా అవకాశాలు వస్తే చేసుకుంటూ ఆడియన్స్ కి టచ్ లో ఉంటున్నాను. అంతేగానీ హీరోగా ముందుకెళ్లాలా .. కమెడియన్ గానే కొనసాగాలా అనే విషయంలో క్లారిటీ లేక కాదు" అని చెప్పుకొచ్చారు.