నా చిన్నప్పుడే మా నాన్న చనిపోయారు: నటి ప్రగతి
Add ap7am to your home Screen

నా చిన్నప్పుడే మా నాన్న చనిపోయారు: నటి ప్రగతి

  • పుట్టి పెరిగింది హైదరాబాద్ లో 
  • ఆ తరువాత చెన్నై వెళ్లిపోయాము 
  • అన్నీ తానై మా అమ్మ నన్ను పెంచింది  
తెలుగు తెరపై సుధ తరువాత యంగ్ మదర్ .. అక్క .. వదిన పాత్రల్లో ఎక్కువగా ప్రగతి కనిపిస్తున్నారు. అందమైన అమ్మగా ప్రేక్షకుల నుండి ఆమె మంచి మార్కులు కొట్టేశారు. అలాంటి ప్రగతి తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో తనకి సంబంధించిన విషయాలను పంచుకున్నారు.

"మాది ఒంగోలు దగ్గర 'ఉలవపాడు' .. కానీ నేను పుట్టి పెరిగింది మాత్రం హైదరాబాద్ లోనే. 10వ తరగతి వరకూ ఇక్కడే చదివాను .. ఆ తరువాత చెన్నైకి షిఫ్ట్ అయ్యాం. మా నాన్నగారు డాక్టర్ .. ఆయన నా చిన్నతనంలోనే అంటే నాకు మూడేళ్ల వయసు ఉండగా చనిపోయారు. నాకు బ్రదర్స్ గానీ .. సిస్టర్స్ గాని లేరు .. అన్నీ తానై మా అమ్మ నన్ను పెంచింది. అమ్మకి .. నాకు 16 ఏళ్ల తేడా మాత్రమే ఉండేది. అందువలన తల్లీ కూతుళ్ల మాదిరిగా కాకుండా ఫ్రెండ్స్ మాదిరిగా ఉండేవాళ్లం. 'అందం అందరి దగ్గరా ఉంటుంది .. కాపాడుకునే వాళ్ల దగ్గర ఎక్కువ కాలం ఉంటుంది' అనే విషయాన్ని నేను నేర్చుకున్నది మా అమ్మ దగ్గరే" అని చెప్పుకొచ్చారు.  
pragathi
ali

More Telugu News