మెగాహీరో మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్?
- షూటింగు దశలో సంకల్ప్ రెడ్డి మూవీ
- వ్యోమగామిగా వరుణ్ తేజ్
- ప్రత్యేకమైన సెట్లో చిత్రీకరణ
ప్రత్యేకమైన శిక్షణ తీసుకుని మరీ ఈ సినిమా షూటింగులో వరుణ్ తేజ్ పాల్గొంటున్నాడు. ఈ సినిమా కోసం కొన్ని టైటిల్స్ ను పరిశీలించిన టీమ్ .. 'అంతరిక్షం' అనే టైటిల్ వైపు మొగ్గుచూపిందట. దాంతో నిర్మాతలు 'అంతరిక్షం' అనే టైటిల్ ను ఫిల్మ్ చాంబర్లో రిజిస్టర్ చేయించినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి .. అదితీరావు నటిస్తున్నారు. ఇప్పటికే 'ఫిదా' .. 'తొలిప్రేమ' సినిమాలతో సక్సెస్ ను అందుకున్న వరుణ్ తేజ్, ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొడతాడేమో చూడాలి.