25 కోట్లు ట్యాక్స్ కడుతున్నా.. తృప్తి మాత్రం లేదు!: పవన్ కల్యాణ్
- కోట్లు ఇవ్వలేని ఆనందం ప్రజా సేవలోనే ఉందని నమ్మాను
- ఎంపీ, ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని ఆఫర్ చేశారు
- పదవులు ఒకరిచ్చేదేమిటి.. నేనే గెలుచుకుంటా
ఎంపీ, ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని తనకు ఆఫర్ చేశారని... ఆ పదవులు తనకు ఒకరిచ్చేదేమిటని, వాటిని నేనే గెలుచుకుంటానని చెప్పారు. ప్రజల మద్దతు ఉంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. విజయనగరంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విజయనగరానికి స్మార్ట్ సిటీ అవార్డు ఎలా వచ్చిందో తనకు అర్థం కావడం లేదని... ఎక్కడ చూసినా కుక్కలు, పందులే కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు.