అప్పులపాలవడంతో అప్పట్లో ఇండస్ట్రీ వదిలిపెట్టేసి వెళ్లిపోయా!: నటుడు జయప్రకాశ్ రెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అప్పులపాలవడంతో అప్పట్లో ఇండస్ట్రీ వదిలిపెట్టేసి వెళ్లిపోయా!: నటుడు జయప్రకాశ్ రెడ్డి

  • చాలామంది డబ్బులు ఎగ్గొట్టారు 
  • అప్పులు చేయవలసి వచ్చింది
  • భార్యాబిడ్డలతో సొంతవూరు వెళ్లిపోయా
రంగస్థలం నుంచి సినిమా రంగానికి వచ్చిన తరువాత రంగస్థలాన్ని మరిచిపోని నటులు కొంతమందే. అలాంటి నటుల్లో జయప్రకాశ్ రెడ్డి ఒకరుగా కనిపిస్తారు. అలాంటి ఆయన తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు. "నేను ఇండస్ట్రీకి వచ్చి ఇరవై .. పాతిక సినిమాలు చేసిన తరువాత అప్పుల్లో మునిగిపోయాను. చాలామంది డబ్బులు ఇవ్వలేదు .. ఊరికే చేయించుకున్నారు.

ఉద్యోగానికి లాంగ్ లీవ్ పెట్టేసి వచ్చాను కనుక .. అప్పులు చేస్తూ 9 సంవత్సరాల పాటు నా భార్యా బిడ్డలను చూసుకున్నాను. అమ్మో.. ఇక ఇక్కడే వుంటే ఇంకా ఇబ్బంది పడిపోతానని చెప్పేసి ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోయాను. అట్లా వెళ్లిపోయిన నేను అయిదు సంవత్సరాల పాటు స్కూల్ పిల్లలకి పాఠాలు చెప్పుకుంటూ మా ఊళ్లోనే వున్నాను. ఈ అయిదు సంవత్సరాల్లో నన్ను గుర్తుపెట్టుకుని ఫోన్ చేసింది ఒక్క సురేశ్ ప్రొడక్షన్స్ వారే .. కానీ నేను వెళ్లలేదు .. సినిమాలు కలిసి రావడం లేదనేదే అందుకు కారణం" అని చెప్పుకొచ్చారు.        
jayaprakash reddy

More Telugu News