ఒక 'దర్శకుడి'పై పూనమ్ కౌర్ కామెంట్స్.. హాట్ టాపిక్ గా మారిన వైనం!

  • ఆయన మనుషులను కూడా డైరెక్ట్ చేస్తాడు
  • అలా నన్ను కూడా డైరెక్ట్ చేయాలని చూశాడు
  • ఆయనకి సంబంధించిన వాళ్లే ఇండస్ట్రీలో ఉండాలి   
సినీ నటి పూనమ్ కౌర్ అప్పుడప్పుడు కొన్ని ఆసక్తికరమైన ట్వీట్స్ చేస్తూ, అందరిలోనూ ఆలోచనలు రేకెత్తిస్తుంటుంది. అలాగే తాజాగా ఆమె చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది."ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ వున్నాడు. సినిమాలనే కాదు .. మనుషులను కూడా డైరెక్ట్ చేస్తుంటాడు. నన్ను కూడా డైరెక్ట్ చేయాలని చూశాడు .. అందులో భాగంగా మాయ చేశాడు కూడా.

ఆ విషయంపై వివరణ అడిగితే .. ఏమీ ఎరుగనట్టుగా నటించాడు. ఆయనకి సంబంధించిన అమ్మాయిలే ఇండస్ట్రీలో వుండాలని కోరుకుంటాడు" అని చెప్పుకొచ్చింది. అయితే ఆ డైరెక్టర్ ఎవరనేది మాత్రం పూనమ్ బయటపెట్టలేదు. దాంతో పూనమ్ ఎవరి గురించి ఇలా మాట్లాడి ఉంటుంది? అనేది ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారింది.
Go Back to Shorts
poonam kaur

More Telugu News