కథ నచ్చితేనే చేస్తాను .. అందుకే ఈ గ్యాప్: ప్రణీత
Add ap7am to your home Screen

కథ నచ్చితేనే చేస్తాను .. అందుకే ఈ గ్యాప్: ప్రణీత

  • తమిళ .. కన్నడ భాషల్లో బిజీ 
  • కథ నచ్చకపోతే చేయను 
  • అందువల్లనే వరుస సినిమాలు వుండవు
విశాలమైన కళ్లతో .. కాజల్ కి దగ్గరగా అనిపించే పోలికలతో ప్రణీత కనిపిస్తూ ఉంటుంది. చాలాకాలం క్రితమే తెలుగు తెరకి పరిచయమైనా, కొన్ని సినిమాలు మాత్రమే చేయగలిగింది. వాటిలో ఆమెకి బాగా పేరు తెచ్చిపెట్టిన సినిమా 'అత్తారింటికి దారేది'. ఈ సినిమా తరువాత ఆమె 'బ్రహ్మోత్సవం ' చేసింది గానీ, అది కాస్తా పరాజయంపాలు కావడంతో అప్పటి నుంచి తెలుగు తెరపై కనిపించలేదు.

ప్రస్తుతం రామ్ జోడీగా 'హలో గురు ప్రేమకోసమే' సినిమా చేస్తోంది. అయితే ఇది తన కమ్ బ్యాక్ సినిమా అనుకోవలసిన అవసరం లేదని చెబుతోంది. తెలుగులో తనకి నచ్చిన కథలు రాకపోవడం, తమిళ .. కన్నడ సినిమాలతో బిజీగా ఉండటం వలన ఇలా గ్యాప్ వచ్చిందని అంటోంది. ఈ కారణాల వల్లనే తెలుగులో తాను వరుస సినిమాలు చేయలేకపోతున్నానంటూ సెలవిచ్చింది. 'హలో గురు ప్రేమ కోసమే'లో తాను చేస్తున్న పాత్ర తన మనసుకు దగ్గరగా ఉంటుందనీ, అందుకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని చెప్పుకొచ్చింది.     
praneta
ram

More Telugu News