నేటి నుంచి బీఎస్ఎన్ఎల్ ఉచిత సిమ్ మేళా!
Add ap7am to your home Screen

నేటి నుంచి బీఎస్ఎన్ఎల్ ఉచిత సిమ్ మేళా!

  • తెలంగాణ సర్కిల్ వ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ మెగా మేళా
  • వినియోగదారులకు ఉచిత 3జీ స్మార్ట్ సిమ్స్  
  • ఓ ప్రకటన విడుదల చేసిన బీఎస్ఎన్ఎల్ 
నేటి నుంచి తెలంగాణ సర్కిల్ వ్యాప్తంగా మెగా మేళాను ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ నిర్వహిస్తోంది. ఈరోజు నుంచి 11వ తేదీ వరకు ఉచిత 3జీ స్మార్ట్ సిమ్ లను వినియోగదారులకు అందజేయనున్నట్టు టెలికం ఏజీఎం ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రకటన చేశారు.

బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్, ఫ్రాంఛైజీ, రిటైల్ ఔట్ లెట్ నుంచి, తాము నిర్వహించే రోడ్ షోల ద్వారా ఈ ఉచిత సిమ్ లను వినియోగదారులు పొందవచ్చని తెలిపింది. కొత్త కనెక్షన్ తో 351 ఎంబీ ఉచిత డేటాను వినియోగదారులకు అందిస్తున్నామని, ఇతర వివరాలకు 14546 టోల్ ఫ్రీ నెంబర్ లో వినియోగదారులు సంప్రదించాల్సిందిగా ఆ ప్రకటనలో కోరారు.
Telangana
bsnl

More Telugu News