తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు
Add ap7am to your home Screen

తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు

  • వరంగల్ అర్బన్‌, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షం
  • పలు చోట్ల కూలిన చెట్లు
  • అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ల ఆదేశాలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వరంగల్ అర్బన్‌, ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి, సిద్ధిపేట, హుస్నాబాద్, గజ్వేల్లో వర్షాల ధాటికి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అర్బన్ జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతుండడంతో పలు ప్రాంతాల్లో భారీ చెట్లు సైతం విరిగిపడుతున్నాయి. అలాగే, విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

భారీ వర్షాల కారణంగా సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ భారీ వర్షాలు పడుతోన్న విషయం తెలిసిందే.   
Telangana
Warangal Urban District
rain

More Telugu News