బీజేపీకి ఆరెస్సెస్ షాక్.. కర్ణాటకలో 70 సీట్లు మాత్రమే వస్తాయన్న అంతర్గత నివేదిక
- బీజేపీ నేతలకు మింగుడు పడని ఆరెస్సెస్ నివేదిక
- కాంగ్రెస్‌కు 115-120 సీట్లు
- అమిత్‌షాకు నివేదిక అందజేత
బీజేపీకి 70, కాంగ్రెస్‌కు 115-120, జేడీఎస్‌కు 29-34 సీట్లు వచ్చే అవకాశం ఉందని నివేదికలో ఉండడాన్ని చూసి నేతలు కంగుతిన్నారు. దళితులు, బలహీన వర్గాల వారిని బీజేపీ ఆకర్షించలేకపోయిందని నివేదికలో పేర్కొన్నారు. అలాగే, గాలి సోదరులకు పార్టీ టికెట్లు ఇవ్వడం, అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతున్న పెట్రో ధరలు, జీఎస్టీ, నిరుద్యోగ సమస్య.. తదితర అంశాలు బీజేపీ నుంచి ప్రజలను దూరం చేశాయని నివేదికలో పేర్కొన్నారు.
కర్ణాటక ఎన్నికలపై మూడు నెలలుగా సర్వే నిర్వహిస్తున్న బీజేపీ దాని ప్రకారమే అభ్యర్థులకు టికెట్లు కేటాయించింది. అయినప్పటికీ తాజా నివేదిక నేతలకు మింగుడు పడడం లేదు. తాజాగా ఓ కన్నడ పత్రిక నిర్వహించిన సర్వేలోనూ బీజేపీ అధికారంలోకి రాదని తేలింది. ఈ కారణంగానే మాజీ ప్రధాని, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడను మచ్చిక చేసుకునేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.