'ముత్యాలముగ్గు'లో మేకప్ లేకుండా చేయమంటే ఆశ్చర్యపోయాను: సీనియర్ హీరోయిన్ సంగీత
Add ap7am to your home Screen

'ముత్యాలముగ్గు'లో మేకప్ లేకుండా చేయమంటే ఆశ్చర్యపోయాను: సీనియర్ హీరోయిన్ సంగీత

  • నా మొదటి సినిమా 'తీర్పు'
  • రెండవ సినిమా 'ముత్యాలముగ్గు'
  • బాపు .. రమణ గార్లు అలా అన్నారు
తెలుగు తెరపై నవరసాలతో మెప్పించిన సీనియర్ కథానాయికలలో సంగీత ఒకరు. తను చేసిన అన్ని చిత్రాల్లోను ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టిన చిత్రం 'ముత్యాల ముగ్గు'. అందువల్లనే ఆమెను 'ముత్యాల ముగ్గు' సంగీత అని కూడా పిలుస్తుంటారు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో సంగీత మాట్లాడుతూ ఈ సినిమాను గురించి ప్రస్తావించారు.

" తెలుగులో నేను చేసిన మొదటి సినిమా 'తీర్పు' .. ఆ తరువాత 'ముత్యాల ముగ్గు' సినిమాలో చేశాను. ఈ సినిమాలో మేకప్ లేకుండా నటించవలసి ఉంటుందని బాపు - రమణ గారు చెప్పారు. సినిమా అంటేనే అంతా మేకప్ తో కనిపించవలసి ఉంటుంది .. అలాంటిది మేకప్ లేకుండా చేయమంటారేంటని ఆశ్చర్యపోయాను .. ఆలోచనలో పడ్డాను. ఫరవాలేదు .. ఈ సినిమా నీకు మంచి పేరు తెస్తుంది అని ధైర్యం చెప్పి చేయించారు .. అలాగే జరిగింది" అంటూ చెప్పుకొచ్చారు.       
sangeeta
ali

More Telugu News