charan: చరణ్ ఇంట్రడక్షన్ సీన్ గురించి సుకుమార్

షార్ట్స్‌లో చూడండి
'రంగస్థలం' సినిమా సంచలన విజయానికి అర్థం చెప్పింది. బలమైన కథాకథనాలు ఉంటే, ప్రేక్షకులు ఏ స్థాయిలో బ్రహ్మరథం పడతారనేది నిరూపించింది. అలాంటి ఈ సినిమా విశేషాలను గురించి ఐ డ్రీమ్స్ తో సుకుమార్ పంచుకున్నారు. సాధారణంగా ఒక మాస్ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సీన్ ఒక రేంజ్ లో ఉంటూ ఉంటుంది. కానీ 'రంగస్థలం' సినిమాలో చరణ్ ఇంట్రడక్షన్ చాలా సాదాసీదాగా ఉంటుంది.

అందుకు సంబంధించిన ప్రశ్న ఎదురుకావడంతో సుకుమార్ మాట్లాడుతూ .." కథ .. ఆ పాత్రను మాత్రమే నేను దృష్టిలో పెట్టుకున్నాను. హీరో చరణ్ కదా .. ఆయన స్థాయిలో నేను ఇంట్రడక్షన్ సీన్ ఇవ్వడం లేదని నేను అనుకోలేదు. అలా అనిపిస్తే కథకి తగిన విధంగా ముందుకు వెళ్లలేం. నేను ఇచ్చినది కథకి తగిన ఇంట్రడక్షన్ అని గట్టిగా నమ్మడం వల్లనే ఆ సీన్ అంత బాగా వచ్చిందనీ .. అభిమానులను మెప్పించిందని భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.  
Go Back to Shorts
charan
samanta

More Telugu News