హైదరాబాద్ లో గత వారాంతంలో జరిగిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ఓ యువతి సృష్టించిన హంగామా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తన స్నేహితుడు మందు కొట్టి కారు నడుపుతూ ఉంటే, పక్కనే కూర్చున్న ఆమె, పోలీసులు అతడిని పట్టుకునేసరికి రెచ్చిపోయింది.

పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో పాటు రోడ్డుపై దొరికిన రాయిని తీసుకుని మీడియా ప్రతినిధులపై విసిరి కొట్టింది. తన బాయ్ ఫ్రెండ్ ను ఎందుకు ఆపారని కేకలు పెట్టింది. రాయడానికి వీలులేని విధంగా తిడుతున్న ఆమెను ట్రాఫిక్ పోలీసులు అదుపు చేయలేక శాంతి భద్రతల పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆపై మహిళా పోలీసుల సాయంతో ఆమెను, ఆమె ఫ్రెండ్ నూ జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. ఆ వీడియోను మీరూ చూడండి.