హీరో జై పుట్టినరోజు .. శుభాకాంక్షలు తెలిపిన అంజలి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హీరో జై పుట్టినరోజు .. శుభాకాంక్షలు తెలిపిన అంజలి

  • 'జర్నీ' సినిమాతో జై .. అంజలి మధ్య పరిచయం 
  • ఆ తరువాత అది ప్రేమగా మారిందనే టాక్ 
  • ఆసక్తిని రేకెత్తిస్తూ అంజలి పోస్ట్ చేసిన సెల్ఫీ   
తమిళ హీరో 'జై' .. హీరోయిన్ అంజలి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతోందనే వార్త కోలీవుడ్లో చాలాకాలంగా వినిపిస్తోంది. 'జర్నీ' సినిమా షూటింగు సమయంలో జరిగిన పరిచయం ప్రేమగా మారిందని అంటారు. తమ మధ్య ప్రేమ నిజమేనని కానీ .. కాదని గాని ఈ జంట ఎక్కడా చెప్పలేదు. అయితే తాజాగా అంజలి పోస్ట్ చేసిన ఒక ఫోటో మళ్లీ వీళ్లిద్దరి గురించి అంతా మాట్లాడుకునేలా చేస్తోంది.

గతంలో 'జై' పుట్టినరోజున ఆయన షూటింగులో వుంటే, అక్కడికే అంజలి కేక్ తీసుకెళ్లి ఆయనతో కట్ చేయించింది. ఆమె లొకేషన్ కి వెళ్లి మరీ ఆయన బర్త్ డే ను సెలబ్రేట్ చేయడం గురించి అంతా చెప్పుకున్నారు. ఇక ఈ రోజున 'జై' పుట్టినరోజు కావడంతో .. అంజలి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసింది. అంతేకాదు 'జై'తో తీసుకున్న సెల్ఫీని పోస్ట్ చేసింది. దాంతో ఈ ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఇంకా కొనసాగుతూనే ఉందని చర్చించుకోవడం మొదలుపెట్టారు.       
jai
anjali

More Telugu News