అనుక్షణం అప్రమత్తంగా ఉండండి: ఎంపీలకు చంద్రబాబు సూచన
- రాబోయే ఇబ్బందులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి
- పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లండి
- మనకు ఎవరిపైనా కోపం లేదు
నిధుల కోసం పదేపదే కేంద్రం చుట్టూ తిరిగినా... ఫలితం దక్కలేదని చెప్పారు. టీడీపీ ఎంపీలంతా జాగ్రత్తగా వ్యవహరించాలని, అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాబోయే ఇబ్బందులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు. తమకు మోదీ, బీజేపీ, ఎన్డీయే, యూపీఏలపై కోపం లేదని... ఏపీకి జాతీయ పార్టీలు అన్యాయం చేస్తున్నాయనేదే తమ బాధ అని తెలిపారు.