'యమలీల'లో దివ్యభారతి నటించాల్సింది .. ఆమె నాకు మాట ఇచ్చింది: అలీ
Add ap7am to your home Screen

'యమలీల'లో దివ్యభారతి నటించాల్సింది .. ఆమె నాకు మాట ఇచ్చింది: అలీ

  • దివ్యభారతి మంచి అమ్మాయి 
  • నాతో ఎంతో ఫ్రెండ్లీగా ఉండేది 
  • ఆమె చేయాల్సిన పాత్ర ఇంద్రజ చేసింది  
కమెడియన్ గా అలీకి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. అటు సీనియర్ హీరోలతోను . . ఇటు కుర్ర హీరోలతోను కలిసి తెరపై ఆయన తెగ సందడి చేస్తుంటాడు. అలాంటి అలీ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. ఆసక్తికరమైన ఒక విషయం చెప్పాడు. " 'తొలిముద్దు' సినిమాలో హీరో ప్రశాంత్ స్నేహితుడిగా నేను నటించాను. ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన దివ్యభారతి చాలా మంచి అమ్మాయి".

"తెలుగు డైలాగ్స్ విషయంలో నేను సాయం చేస్తుండటం వలన .. నాతో ఆమె చాలా స్నేహంగా ఉండేది. ఆమె ఎంతో కలివిడిగా ఉండటం వలన నేను 'దివ్య' అని పిలిచేవాడిని. 'నీకు హీరోగా ఛాన్స్ వస్తే నేను నీ జోడీగా నటిస్తాను' అంటూ నాకు మాట ఇచ్చింది. 'యమలీల' సినిమా మరికొన్ని రోజుల్లో మొదలవుతుందనగా ఆమె చనిపోయింది. దివ్యభారతి బతికుంటే ఆ సినిమాలో హీరోయిన్ గా ఆమే చేసేది. ఆమె చనిపోవడం వలన నా సరసన ఇంద్రజ చేసింది" అంటూ ఆనాటి సంగతులను అలీ గుర్తుచేసుకున్నాడు.  
ali
divyabharathi

More Telugu News