ముస్లింల గురించి మాట్లాడుతున్నారు.. బీసీల గురించి ఎందుకు మాట్లాడరు?: కేసీఆర్ పై లక్ష్మణ్ ఫైర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముస్లింల గురించి మాట్లాడుతున్నారు.. బీసీల గురించి ఎందుకు మాట్లాడరు?: కేసీఆర్ పై లక్ష్మణ్ ఫైర్

  • ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదు
  • ఎంఐఎం మెప్పు కోసం కేసీఆర్ ఆరాటపడుతున్నారు
  • పూటకోమాట మాట్లాడుతూ పబ్బం గడుపుకుంటున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ నేత లక్ష్మణ్ మండిపడ్డారు. పూటకో మాట మాట్లాడుతూ కేసీఆర్ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. ముస్లిం రిజర్వేషన్లను సాధించడం కోసం ఢిల్లీలో ధర్నా చేస్తామని బెదిరిస్తున్నారని అన్నారు. హైదరాబాదులో ధర్నా చౌక్ ను పీకేసినవారు... ఢిల్లీలో ఎలా ధర్నా చేస్తారని మండిపడ్డారు.

ఎంతమాత్రం అమలుకు నోచుకోనటువంటి ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చి, గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఎంఐఎం మెప్పు పొందేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని అన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. బీసీ రిజర్వేషన్లపై కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
KCR
lakshman
MIM
muslim reservations

More Telugu News