ఏపీకి బీజేపీ సపోర్ట్ చేయకపోవడానికి కారణం ఇదే: వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి
- డబుల్ డిజిట్ గ్రోత్ సాధించామని టీడీపీ చెప్పుకుంటుంది
- అందుకే కేంద్రం సాయం చేయడం లేదు
- అన్నా క్యాంటీన్లకు నిధులు కేటాయించడం ఎన్నికల స్టంటే
ఏపీకి ఇచ్చిన విభజన హామీలు నెరవేరకపోవడానికి, ప్రత్యేక హోదా రాకపోవడానికి టీడీపీనే కారణమని విమర్శించారు. వ్యవసాయరంగం ఏకంగా 40 శాతం ఎలా అభివృద్ధి చెందిందో చెప్పాలని డిమాండ్ చేశారు. గత నాలుగేళ్లలో కేవలం రూ. 12 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని చెప్పారు. కేవలం ఎన్నికల స్టంట్ కోసమే అన్న క్యాంటీన్లకు రూ. 200 కోట్లు కేటాయించారని మండిపడ్డారు. అమరావతిలో ఇంత వరకు ఒక్క ఇటుక కూడా పడలేదని అన్నారు.