ఏం మాట్లాడతారో చూసి... చంద్రబాబు క్యాబినెట్ నుంచి బీజేపీ మంత్రుల రాజీనామా!
- క్లైమాక్స్ చేరిన టీడీపీ - బీజేపీ పొత్తు
- నేడు అసెంబ్లీలో కీలక ప్రకటన చేయనున్న బాబు
- బాబు ప్రసంగం తరువాత రాజీనామాలు
- సన్నిహితులకు చెప్పిన కామినేని, పైడికొండల
అయితే, అంతకు ముందుగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చంద్రబాబు ఏం మాట్లాడతారో చూద్దామని, ఆ తరువాత నేడే రాజీనామాలు సమర్పిద్దామని బీజేపీ మంత్రులు భావిస్తున్నారని సమాచారం.ఈ విషయంపై ఇప్పటికే అధిష్ఠానంతో మాట్లాడిన మంత్రులు కామినేని శ్రీనివాస్, పైడికొండల మాణిక్యాలరావు, ప్రస్తుతం సీఎం చంద్రబాబు ప్రకటన కోసమే వేచి చూస్తున్నామని తమ సన్నిహితుల వద్ద వెల్లడించారు.