పెళ్లి వేడుకలో 'కజరా రే' పాటకు కోహ్లీ స్టెప్పులు...వీడియో వైరల్
- స్నేహితుడి పెళ్లి వేడుకలో కోహ్లీ చిందులు
- బంటీ ఔర్ బబ్లీ సినిమాలో పాటకు వరుడితో కలిసి స్టెప్పులు
- సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియో
తాజాగా అతను తన మిత్రుడు గగన్ గుజ్రాల్ పెళ్లి వేడుకకు వెళ్లాడు. భంగ్రా స్టెప్పులతో పాటు అక్కడ పెళ్లికొడుకుతో కలిసి 'బంటీ ఔర్ బబ్లీ' సినిమాలోని 'కజరా రే...' పాటకు స్టెప్పులేశాడు. ఈ వీడియోను ఓ అభిమాని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇప్పుడిది వైరల్గా మారింది. ఇందులో కోహ్లీ అత్తమామలు కూడా కనిపిస్తారు. సినిమా షూటింగ్లలో బిజీగా ఉండటం వల్ల తన భార్య అనుష్క శర్మ ఈ వేడుకకు హాజరుకాలేదని వారి సన్నిహితులు చెబుతున్నారు.