భారత్, శ్రీలంక, బంగ్లా ట్రై సిరీస్ నుంచి వైదొలగిన బంగ్లాదేశ్ ఆల్ రౌండర్
- ఈ నెల 6వ తేదీ నుంచి ముక్కోణపు టీ20 సిరీస్
- ప్రకటన చేసిన బంగ్లా క్రికెట్ బోర్డు
- గాయం నుంచి కోలుకోలేదని వివరణ
తాజాగా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటన చేసి, షకిబుల్ వేలి గాయంతో బాధపడుతున్నాడని ఈ సిరీస్ ఆడలేడని చెప్పడంతో బంగ్లా అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇటీవల ఢాకాలో జరిగిన ఓ వన్డే మ్యాచులో ఆడుతూ షకిబుల్ గాయపడ్డాడు. ట్రై సిరీస్ నాటికి కోలుకుంటాడని భావించారు. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో ఆయన ఈ సిరీస్‌కి దూరమవుతున్నాడు.