నాగశౌర్యకి ఖరీదైన కారును కానుకగా ఇచ్చిన తల్లి!

  • 'ఛలో'తో హిట్ కొట్టిన నాగశౌర్య 
  • సొంత నిర్మాణంలో లాభాలు 
  • తల్లి నుంచి కానుకగా ఖరీదైన కారు
నాగశౌర్య హీరోగా ఆయన సొంత బ్యానర్లో తెరకెక్కిన 'ఛలో' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమా, చిన్న సినిమా సాధించిన పెద్ద విజయంగా నిలిచింది. కామెడీతో కూడిన ఈ లవ్ స్టోరీ యూత్ ను విపరీతంగా ఆకట్టుకోవడంతో, ఈ సినిమా ఇంతవరకూ 28 కోట్ల గ్రాస్ ను సాధించింది.

 హీరోగా నాగశౌర్య కెరియర్లో చెప్పుకోదగిన హిట్ ఇచ్చిన ఈ సినిమా, నిర్మాణపరంగాను వాళ్ల ఫ్యామిలీకి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఈ సంతోషంతో నాగశౌర్యకి ఆయన తల్లి ఒక ఖరీదైన కారు (porsche cayman 718)ని కొనిపెట్టింది. తల్లి నుంచి ఆ కారును కానుకగా అందుకున్న నాగశౌర్య, ఆనందంతో పొంగిపోతున్నాడు. ఇక నుంచి తాను ఇందులోనే జోరుగా షికారు చేసేస్తానని అంటున్నాడు. ఆయన తాజా చిత్రం తమిళంలో 'కరు' పేరుతోనూ .. తెలుగులో 'కణం' పేరుతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.    
Go Back to Shorts
nagashaurya

More Telugu News