రూ. కోటి ఇవ్వాలంటూ మహిళను బెదిరించిన బిగ్ బాస్ పోటీదారుడు
- స్వచ్చంద సంస్థకు చెందిన మహిళకు బెదిరింపులు
- పాకిస్థాన్ నుంచి మాట్లాడుతున్నానంటూ ఫోన్
- జుబేర్ అలీఖాన్ ను అరెస్ట్ చేసిన క్రైమ్ బ్రాంచ్
పాకిస్థాన్ నుంచి తాను మాట్లాడుతున్నానని... రూ. కోటి ఇవ్వాలని ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో, సదరు బాధితురాలు ముంబై క్రైమ్ బ్రాంచ్ కు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేయగా... ఆ బెదిరింపులు చేసింది జుబేర్ అలీఖాన్ అని తేలింది. దీంతో, అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, అతడిని అరెస్ట్ చేశారు.