చంద్రబాబును విమర్శించడమంటే.. మోసం చేయడమే: బీజేపీ నేతలపై మండిపడ్డ సీపీఐ రామకృష్ణ
- ప్రభుత్వంలో ఉంటూనే ముఖ్యమంత్రిని విమర్శిస్తారా?
- రాం మాధవ్ చెప్పినట్టు వ్యవహరిస్తున్నారన్న రామకృష్ణ
- దేశ పటంలో ఏపీని లేకుండా చేయాలనుకుంటున్నారన్న చలసాని
ఇదే సందర్భంగా ఏపీ బీజేపీ మంత్రులపై ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ దక్షిణ భారతదేశానికి బీజేపీ చాలా అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. భారతదేశ పటంలో ఏపీని లేకుండా చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. దమ్ముంటే ఏపీ కేబినెట్ లో ఉన్న బీజేపీ మంత్రులు ఇద్దరూ వైదొలగాలని డిమాండ్ చేశారు.