అత్తమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలంటున్న ఉపాసన!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అత్తమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలంటున్న ఉపాసన!

  • మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ పుట్టినరోజు
  • ఈ సందర్భంగా తన అత్తయ్యకు బర్త్ డే విషెస్ చెప్పిన ఉపాసన
  • మా అత్తయ్య మా కుటుంబానికి బలమంటూ ఓ ఫొటోను పోస్ట్ చేసిన వైనం 
మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ భార్య ఉపాసన ఓ ట్వీట్ చేశారు. ‘హ్యాపీ బర్త్ డే అత్తమ్మ. మా కుటుంబానికి బలం’ అని చెప్పడంతో పాటు, సురేఖతో కలిసి ఉపాసన దిగిన ఓ ఫొటోను ఈ సందర్భంగా పోస్ట్ చేశారు.

ఈ ఫొటోలో సురేఖ గోరింటాకు పెట్టించుకుంటూ కనపడ్డారు. కాగా, సామాజిక మాధ్యమాల్లో ఉపాసన చాలా చురుగ్గా ఉంటారు. తన రోజువారీ కార్యక్రమాలు, తమ కుటుంబానికి సంబంధించిన వేడుకలకు సంబంధించిన ఫొటోలను ‘మెగా’ అభిమానులతో ఉపాసన తరచుగా పంచుకోవడం తెలిసిందే.
upasana
surekha

More Telugu News