రేపిస్టుకి నాలుగు మరణశిక్షలు... చిన్నారిపై రేప్, మర్డర్ కేసులో పాక్ కోర్టు సంచలన తీర్పు!
- దోషికి నాలుగు మరణశిక్షలు, యావజ్జీవ శిక్ష
- మరో ఏడుగురు బాలికలను కూడా రేప్ చేసి, హత్య చేసినట్టు అభియోగాలు
- కోర్టు తీర్పుపై సర్వత్రా హర్షం
ఈ కేసు కోసం ఈ నెల 12న కోట్ లక్‌పత్ జైలులో న్యాయమూర్తి సజ్జద్ అహ్మద్ 36 మంది సాక్షులను విచారించారు. కాగా, గతనెల 5న జైనబ్ కన్పించకుండా పోయింది. ఆ తర్వాత అదే నెల 9న ఆమె మృతదేహాన్ని షాబాజ్ ఖాన్ రోడ్డుకు సమీపంలోని ఓ చెత్తకుప్ప నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమెకు న్యాయం జరగాలంటూ పాకిస్థాన్ వ్యాప్తంగా అనేక మంది ర్యాలీ చేపట్టారు. దోషికి న్యాయమూర్తి కఠిన శిక్ష విధించడంతో వారంతా ఇపుడు హర్షం వ్యక్తం చేస్తున్నారు.