నా నటన బాలచందర్ గారికి నచ్చలేదనుకున్నాను .. మధ్యలోనే వెళ్లిపోదామనుకున్నాను: సీనియర్ నటుడు జీవా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా నటన బాలచందర్ గారికి నచ్చలేదనుకున్నాను .. మధ్యలోనే వెళ్లిపోదామనుకున్నాను: సీనియర్ నటుడు జీవా

  • బాలచందర్ గారి మూవీలో ఫస్టు సీన్ చేశాను
  • ఆయన ఏమీ మాట్లాడలేదు
  • బాగా చేయలేదేమోననే డౌట్ వచ్చింది 
  • మా ఊరెళ్లిపోదామనుకున్నాను    
బాలచందర్ తో తన తొలి సినిమా విశేషాలను గురించి, ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో సీనియర్ నటుడు జీవా ప్రస్తావించారు. తమిళ .. తెలుగు భాషల్లో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. తెలుగులో ఈ సినిమా పేరు 'తొలికోడి కూసింది'. సీమ .. సరిత .. మాధవి ఈ ముగ్గురు హీరోయిన్లు. కథ ప్రకారం ఆ ఊరికి పెద్ద నేను .. ఎన్నికల సందర్భంలో నా వాల్ పోస్టర్ కి ఎవరో పేడ కొడతారు. ఎవరు కొట్టారని అక్కడున్న వాళ్లను అడిగే సీన్ అది. చుట్ట కాలుస్తూ .. చేతిలోని కర్ర తిప్పుతూ తమిళంలో అడగాలి".

"బాలచందర్ గారు చెప్పినట్టుగానే చేశానుగానీ .. ఆయన కళ్లలో సంతృప్తి కనిపించలేదు. దాంతో బాధనిపించింది .. పేకప్ చెప్పేశాక రూంకి వచ్చేశాను. పెన్ను పేపర్ తీసుకుని .. 'రెస్పెక్టెడ్ సర్ .. ప్లీజ్ ఎక్స్ క్యూజ్ మీ .. యువర్ సెలక్షన్ ఈజ్ రాంగ్' అంటూ రాసేసి, దిండుపై పెట్టేసి .. మా ఊరు వెళ్లిపోదామనే ఉద్దేశంతో బయటికి వచ్చేశాను. కానీ అక్కడున్న వాళ్లు నన్ను ఆపేశారు. 'ఇది సినిమా అట్లా వెళ్లిపోకూడదు' అని క్లాస్ పీకారు. పొద్దున్నే మళ్లీ లొకేషన్ కి వెళ్లి బాలచందర్ గారికి నమస్కరించాను. ఆయన నా నటనను అభినందిస్తూ భుజం పై చేయివేశారు .. అప్పుడు మనసు కుదుటపడింది" అని చెప్పుకొచ్చారు.    
jeeva
balachandar

More Telugu News