ఫొటోలో నా కళ్లు చూసే బాలచందర్ పిలిపించారు!: సీనియర్ నటుడు జీవా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫొటోలో నా కళ్లు చూసే బాలచందర్ పిలిపించారు!: సీనియర్ నటుడు జీవా

  • బాలచందర్ గారి యూనిట్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది 
  • ఆయన షూటింగులో ఉండగా వెళ్లి కలిశాను 
  • ఆయన చెప్పిన సీన్ చేసి చూపించాను
సినిమాల్లోకి ఎలా వెళ్లాలా అని నేను ఆలోచిస్తూ ఉండగా, బాలచందర్ సినిమాకి సంబంధించిన ప్రకటన పడింది. స్నేహితులంతా ఒత్తిడి చేయడంతో నా ఫొటో పంపించాను. అలా వచ్చిన ఫోటోలన్నీ అక్కడి ఆఫీస్ లో కుప్పగా పోయగా, నా ఫొటో బాలచందర్ కంట పడిందట. 'ఇతని కళ్లు ప్రత్యేకంగా వున్నాయి .. పిలిపించండి' అన్నారట. దాంతో వాళ్లు టెలిగ్రామ్ కొట్టడం, నేను వెళ్లి కలవడం జరిగాయి.

"అప్పుడు అక్కడ కమల్ .. రజనీ .. జయసుధలపై ఒక సీన్ చేస్తున్నారు. షూటింగ్ బ్రేక్ లో ఆయన నాతో మాట్లాడి ఒక సీన్ చేసి చూపించమంటే 'ఆశ్రయం' అనే నాటకంలోని సీన్ చేసి చూపించాను. సాయంత్రం ఆఫీసుకి వచ్చి కనిపించమన్నారు. అలాగే వెళ్లి కలిశాను .. ఆయన ఒక సీన్ చెప్పి చేయమన్నారు. చేసి చూపించాను .. ఆయన మెచ్చుకోలుగా దగ్గరికి తీసుకున్నారు .. ఆ తరువాత సినిమాలో మెయిన్ రోల్ ఇచ్చారు" అని చెప్పుకొచ్చారు.     
jeeva

More Telugu News