జోరుమీదున్న 'శైలజా రెడ్డి అల్లుడు'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జోరుమీదున్న 'శైలజా రెడ్డి అల్లుడు'

  • మారుతి దర్శకత్వంలో 'శైలజా రెడ్డి అల్లుడు'
  • చైతూ జోడీగా అనూ ఇమ్మాన్యుయేల్ 
  • కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ
ఒక వైపున చందూ మొండేటి దర్శకత్వంలో 'సవ్యసాచి' చేస్తోన్న నాగచైతన్య, మరో వైపున మారుతి దర్శకత్వంలో 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా చేస్తున్నాడు. 'సవ్యసాచి' సినిమా ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ జరుపుకోగా, 'శైలజా రెడ్డి అల్లుడు' ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. నాగచైతన్య కాంబినేషన్లో ప్రధాన పాత్రధారులు పాల్గొంటూ ఉండగా, కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో చైతూ జోడీగా అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది. డిఫరెంట్ కాన్సెప్టుతో రూపొందుతోన్న ఈ సినిమాకి, గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమాలో 'శైలజా రెడ్డి'గా రమ్యకృష్ణ కీలకమైన పాత్రను పోషిస్తోన్న సంగతి తెలిసిందే.  
nagachaitanya
anu emmanuel

More Telugu News