సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
- తమన్నాకు ఆ కోరిక పదేళ్ల తర్వాత తీరిందట!
- ఆగస్టు నుంచి 'ఎన్టీఆర్' బయోపిక్ షూటింగ్
- వాయిదా పడిన సాయిపల్లవి 'కణం'
- అదే బ్యానర్లో నితిన్ మరో సినిమా
* మహానటుడు దివంగత ఎన్టీ రామారావు జీవితంపై తేజ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఎన్టీఆర్' బయోపిక్ రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు నుంచి జరుగుతుంది. ఈ లోగా వెంకటేష్ తో ప్రస్తుతం తాను చేస్తున్న చిత్రాన్ని తేజ పూర్తి చేస్తాడు.
* నాగశౌర్య, సాయిపల్లవి జంటగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న 'కణం' చిత్రం విడుదల వాయిదా పడింది. ఫిబ్రవరి 9న విడుదల కావలసిన ఈ చిత్రాన్ని అదే నెల 23న రిలీజ్ చేస్తారు. ఏఎల్ విజయ్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు.
* ఇటీవల నితిన్ హీరోగా 14 రీల్స్ సంస్థ నిర్మించిన 'లై' చిత్రం పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దీంతో మళ్లీ అదే సంస్థకు నితిన్ మరో చిత్రాన్ని చేస్తున్నాడు. ఓ యువ దర్శకుడు దీనికి దర్శకత్వం వహిస్తాడు.