బిగ్‌బాస్ 11 విజేతగా శిల్పా షిండే.. ట్రోఫీని బహూకరించిన సల్మాన్ ఖాన్
- ఆద్యంతం వినోదాన్ని పంచిన ‘బిగ్‌బాస్’
- అభిమానుల మద్దతుతో విజేతగా నిలిచిన శిల్ప
- ఫినాలేకు హాజరైన అక్షయ్ కుమార్
మహారాష్ట్రలోని లోనావాలాలో 19,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో బిగ్‌బాస్ హౌస్‌ను ఏర్పాటు చేసి చుట్టూ 90 కెమెరాలు అమర్చారు. ఈ షోకు సల్మాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన ఈ షో ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచింది. ఆదివారం నిర్వహించిన గ్రాండ్ ఫినాలేకు బాలీవుడ్ మరో హీరో అక్షయ్ కుమార్ అతిథిగా వచ్చాడు.