32 బంతుల్లో సెంచరీ చేసిన రిషబ్ పంత్... రోహిత్ శర్మ రికార్డు మాయం!
Add ap7am to your home Screen

32 బంతుల్లో సెంచరీ చేసిన రిషబ్ పంత్... రోహిత్ శర్మ రికార్డు మాయం!

  • హిమాచల్ ప్రదేశ్ తో తలపడిన ఢిల్లీ
  • ముస్తాక్ అలీ టీ-20 టోర్నీ
  • చెలరేగి ఆడిన రిషబ్
టీ-20 పోటీల్లో రోహిత్ శర్మ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును ఢిల్లీ కీపర్, బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ బద్దలు కొట్టాడు. ముస్తాక్ అలీ టీ-20 టోర్నీలో భాగంగా జరిగిన పోటీలో హిమాచల్ ప్రదేశ్ తో తలపడిన ఢిల్లీ జట్టులో రిషబ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన హిమాచల్ జట్టు 145 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ ముందుంచగా, రిషబ్ ధాటికి కేవలం 11.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా విజయం సాధించింది. కేవలం 32 బంతుల్లోనే రిషబ్ సెంచరీ సాధించడంతో, గతంలో శ్రీలంకపై 35 బంతుల్లోనే సెంచరీ కొట్టిన రోహిత్ శర్మ రికార్డు బద్దలైంది. కాగా, టీ-20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ క్రిస్ గేల్ (30) పేరిట ఉందన్న సంగతి తెలిసిందే. ఓ ఎండ్ లో రిషబ్ దూకుడును చూపిస్తుంటే, మరో ఎండ్ లో నిలబడిన ఢిల్లీ ఓపెనర్ గౌతమ్ గంభీర్, 30 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు.
Rishab pant
Mustaq Ali T-20
Delhi
Himachal

More Telugu News