కొత్త చిత్రం టీజర్ విడుదల చేసిన అనుష్క శర్మ.... కోహ్లీ ఫొటోను జోడిస్తూ నెటిజన్ల కామెంట్లు!
- భయపెడుతున్న 'పరి' చిత్రం టీజర్
- విరాట్ బెదిరిపోయాడంటూ కామెంట్లు
- ఫన్నీ ఫొటోలు సృష్టిస్తున్న నెటిజన్లు
అనుష్క అందానికి క్లీన్ బౌల్డ్ అయిన విరాట్.. ‘పరి’లో అనుష్కను చూసి బెదిరిపోయాడని అంటున్నారు. అంతేకాకుండా విరాట్ ముఖాన్ని పోస్టర్‌లో కలిపి ఫన్నీ ఫొటోలు కూడా సృష్టిస్తున్నారు. హోలీకి ఇది విడుదలవుతున్న సందర్భంగా ‘హోలీ విత్ పరి’ అన్న ట్యాగ్‌లైన్‌తో బుధవారం ఈ టీజర్‌ను ట్రెండ్ చేశారు. దీన్ని ‘కోహ్లీ విత్ పరి’గా మార్చి సరదా కామెంట్లు చేశారు. మరికొందరైతే దక్షిణాఫ్రికా మ్యాచ్‌కి ముందు కోహ్లీకి అనుష్క ఈ పోస్టర్ చూపించిందని, అందుకే మ్యాచ్‌లో కోహ్లీ సేన ఓడిపోయిందని కామెంట్లు పెడుతున్నారు.