నేను .. చిన్నా కడప నుంచి పారిపోయి వచ్చాం: అలీ
Add ap7am to your home Screen

నేను .. చిన్నా కడప నుంచి పారిపోయి వచ్చాం: అలీ

  • కడపలో ఒక రూమ్ లో దిగాం 
  • ఆ రూమ్ లోని వాడు అక్కడివాడిని ఏదో అన్నాడు 
  • వాళ్ల వర్గం మొత్తం వచ్చేసింది
'శివ' సినిమాలో హీరోకి స్నేహితులుగా నటించిన చిన్నా .. రామ్ జగన్ లతో, తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమం జరిగింది. ఈ షోకి హాజరైన అలీ .. చిన్నా పాతిక సంవత్సరాల క్రితం కడపలో జరిగిన ఓ సంఘటనను గుర్తుచేసుకున్నారు.

 ఆ సంఘటనను గురించి రామ్ జగన్ దగ్గర అలీ ప్రస్తావిస్తూ .. "నేను .. చిన్నా కడప వెళ్లాం .. 'శివ' సినిమాలో ఎంత పెద్ద గొడవ అయిందో .. కడపలో అంత పెద్ద గొడవ అయింది. నేను ... చిన్నా .. బాలాజీ .. ఇంకో ఇద్దరం ఒక రూమ్ లో వున్నాం. సోము అని ఇంకో కేండేట్ వున్నాడు .. తను అక్కడివాడిని ఏదో అన్నాడు. అంతే .. వాళ్ల వర్గం మొత్తం వచ్చేసింది. 'బయటికి రండిరా .. ' అంటూ వాళ్లు అరవడం మొదలు పెట్టారు. చుట్టుపక్కల వున్నవాళ్లు అది షూటింగ్ అనుకుంటున్నారు. మేం వున్నది ముగ్గురం .. వచ్చింది వందమంది. అంతే, అక్కడి నుంచి అందరం పారిపోయాం" అంటూ నవ్వేశారు.      
ali
chinna
ram jagan

More Telugu News