నా అసలు పేరు మంజుల .. ఆమని అనే పేరు ఈవీవీ గారు పెట్టారు: ఆమని
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా అసలు పేరు మంజుల .. ఆమని అనే పేరు ఈవీవీ గారు పెట్టారు: ఆమని

  • తమిళంలో గంగై అమరన్ దర్శకత్వంలో ఫస్టు మూవీ చేశాను
  • ఆయన నాకు 'మీనాక్షి' అనే పేరు పెట్టారు 
  • తెలుగులో 'జంబలకిడి పంబ' ఫస్టు మూవీ
  • అప్పటి నుంచి ఆమని అయ్యాను  
తెలుగు తెరపై నటన పరంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఎక్కువ మార్కులు కొట్టేసిన నిన్నటితరం కథానాయికలలో ఆమని ఒకరుగా కనిపిస్తారు. 'మిస్టర్ పెళ్లామ్' .. 'శుభలగ్నం' .. 'శుభసంకల్పం' ..' మావిచిగురు' వంటి సినిమాలు ఆమని అభినయానికి అద్దం పడతాయి. తాజాగా ఆమె ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు.

"నా అసలు పేరు మంజుల .. తమిళంలో గంగై అమరన్ గారి దర్శకత్వంలో నా మొదటి  సినిమా చేశాను. అప్పుడు ఆయన నాకు మీనా అనే పేరు పెట్టారు. అప్పటికే మీనా కూడా ఎంట్రీ ఇచ్చింది .. తమిళంలో రెండు మూడు సినిమాలు చేసింది కూడా. అందువలన నాకు మీనాక్షి అని పేరు పెట్టారు. ఆ పేరుతోనే తమిళంలో రెండు మూడు సినిమాలు చేశాను గానీ ఆ పేరుకలిసి రాలేదు. ఆ సమయంలో ఈవీవీ సత్యనారాయణ గారు 'జంబలకిడి పంబ'లో నాకు ఛాన్స్ ఇచ్చారు. ఆ సినిమా సమయంలో నా పేరును 'ఆమని'గా ఈవీవీ గారు మార్చారు" అంటూ చెప్పుకొచ్చారు.     
amani
evv

More Telugu News