చిన్నపిల్లలు పాలు తాగాలి బాబూ.. మందు కాదు.. యాంకర్ ప్రదీప్‌పై పోస్ట్‌కు పోలీసుల స్పందన!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిన్నపిల్లలు పాలు తాగాలి బాబూ.. మందు కాదు.. యాంకర్ ప్రదీప్‌పై పోస్ట్‌కు పోలీసుల స్పందన!

  • ప్రదీప్ చిన్నపిల్లాడంటూ సోషల్ మీడియాలో పోస్ట్
  • సూటిగా స్పందించిన ట్రాఫిక్ పోలీసులు
  • సోషల్ మీడియాలో వైరల్
తెలియక చేసిన తప్పుకు ప్రదీప్‌ను వదిలేయాలంటూ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న పోస్టులకు పోలీసులు వెరైటీగా స్పందించారు. ఆయన తాగింది పాలు కాదని, మందు అని పేర్కొన్నారు. న్యూ ఇయర్ జోష్‌లో భాగంగా గతేడాది డిసెంబరు 31న టీవీ వ్యాఖ్యాత ప్రదీప్ ఫుల్లుగా మందుకొట్టి కారు నడుపుతూ పోలీసులకు చిక్కాడు. మోతాదుకు మించి తాగడంతో రెండు నుంచి వారం రోజుల శిక్ష పడే అవకాశం ఉందన్న వార్తలు వచ్చాయి.

అయితే అంతకుముందు కౌన్సెలింగ్‌కు రావాలంటూ పోలీసులు ప్రదీప్‌ను పిలిచారు. అయితే, ప్రదీప్ కౌన్సెలింగ్‌కు హాజరుకాకపోవడంతో అతడు పరారీలో ఉన్నట్టు పోలీసులు ప్రకటించారు. దీంతో స్పందించిన ప్రదీప్ ఓ వీడియోను విడుదల చేస్తూ, తాను షూటింగులతో బిజీగా వున్నానని, త్వరలోనే పోలీసుల ఎదుట హాజరవుతానని ప్రకటించాడు.

కాగా, ప్రదీప్ తెలియక తప్పు చేశాడని పేర్కొంటూ హైదరాబాదు ట్రాఫిక్ పోలీసుల ఫేస్ బుక్ పేజీలో హనీ భవాని పేరుతో ఒకరు పోస్టు పెట్టారు. ‘సార్.. మా ప్రదీప్‌ను ఒగ్గేయండి.. పాపం చిన్నపిల్లాడు.. తెలియక తప్పుచేశాడు’ అంటూ ఆ పోస్టులో రిక్వెస్ట్ చేశారు. దీనికి స్పందించిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. ‘ప్రదీప్ చిన్నపిల్లాడైతే పాలు తాగాలి కానీ, మందు తాగాడు. మందు కొట్టి వాహనం నడపడం కరెక్ట్ కాదు. సెలబ్రిటీలు అందరికీ ఆదర్శంగా ఉండాలి’’ అని రిప్లై ఇచ్చారు. ఇప్పుడీ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
TV Anchor
Pradeep
Hyderabad
Police

More Telugu News