సునీల్ కు జోడీగా చేయమని ఆ హీరోయిన్లు చెప్పారు .. చాలా బాధగా అనిపించింది: దర్శకుడు ఎన్.శంకర్
- సునీల్ సరసన చేయడానికి కొంతమంది ఒప్పుకోలేదు
- డేట్స్ లేవని కొందరు చెప్పారు
- ఇష్టం లేదని మరికొందరు స్పష్టం చేశారు
"కొంతమంది డేట్స్ ప్రాబ్లమ్ అన్నారు .. మరి కొంతమంది చేయడం ఇష్టం లేదని అన్నారు. కొంతమంది హీరోయిన్లు మంచి పాత్రలు దొరకడం లేదని మాట్లాడుతుంటారు. ఒక అద్భుతమైన పాత్రతో వెళ్లినప్పుడు అంగీకరించే సాహసం చేయలేకపోతున్నారు. జమున .. శ్రీదేవి .. సౌందర్య చిన్న హీరోలతోనూ చేశారు .. పెద్ద హీరోలతోను చేశారు. ఇప్పుడున్న కొంతమంది హీరోయిన్లు పెద్ద హీరోతో చేశాక .. రెమ్యునరేషన్ తగ్గుతుందని కిందికి దిగరు. నిజం చెప్పాలంటే, సునీల్ చిన్న హీరో .. ఆయనతో చేస్తే మార్కెట్ ఉండదు అనే రీజన్స్ చెప్పారు. అప్పుడు నాకు చాలా బాధనిపించింది" అని చెప్పుకొచ్చారు.