పిల్లల ప్రేమాభిమానాలకు లొంగిపోయాం: ఉపాసన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పిల్లల ప్రేమాభిమానాలకు లొంగిపోయాం: ఉపాసన

  • ‘ఆశ్రయ ఆకృతి’లో రామ్ చరణ్ దంపతులు
  • చిన్నారులతో కలిసి కేక్ మిక్సింగ్ 
  • మెర్రీ క్రిస్మస్ చెప్పిన ఉపాసన
హైదరాబాద్ లోని ఆశ్రయ ఆకృతి పాఠశాలలోని బధిర పిల్లలతో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన దంపతులు సరదాగా ముచ్చటించారు. వారితో ముచ్చటిస్తూ, సెల్ఫీలు దిగుతూ వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ఉపాసన ఓ ట్వీట్ చేసింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేసింది.

‘ఆశ్రయ ఆకృతి పాఠశాల పిల్లల ప్రేమాభిమానాలకు లొంగిపోయాం.. బధిర పిల్లలతో మిస్టర్ సి ఎందుకంత అటాచ్ మెంట్ తో ఉన్నారనే  విషయం త్వరలోనే మీకు తెలుస్తుంది’ అని చెప్పిన ఉపాసన మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హాలిడేస్ అని పేర్కొన్నారు. కాగా, క్రిస్మస్ నేపథ్యంలో చిన్నారులతో కలిసి రామ్ చరణ్ దంపతులు కేక్ మిక్సింగ్ లో పాల్గొన్నారు.
Ramcharan
upasana

More Telugu News